
జనసేన పార్టీ ఆవిర్భావదినోత్సవ వేడుకలకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక అక్కడి ఏర్పాట్లను మంత్రులు, పార్టీ కీలక నేతలు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో నిర్వహించే జయకేతనం సభకు గత కొద్దిరోజుల ముందు నుంచే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ జనసేన నేతలు, సైనికులు, మంత్రులు. ఈసభకు ఈసారి లక్షలాది మంది వచ్చే అవకాశం ఉండటంతో భారీ సభాప్రాంగణాన్ని సిద్దం చేశారు