జనసేన పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ అవకాశాలు వస్తాయని ఎన్ఆర్ఐ జనసేన శ్రేణులతో సోమవారం జరిగిన వర్చువల్ సమావేశంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. కూటమిలో సర్దుబాటు కోసం కొంతమందికి త్యాగాలు చేయాల్సిన బాధ్యత ఉంటుందని, దానికి తాను కూడా ఒక ఉదాహరణ అని, పార్టీ కోసం పని చేసే ప్రతీ ఒక్కరికీ కొద్దిగా ఆలస్యం అయినా తప్పనిసరిగా అవకాశాలు వస్తాయని చెప్పారు. కూటమి కలయిక సుదీర్ఘ కాలం ఉండాలని ప్రజలు భావిస్తున్నారని నాగబాబు తెలిపారు.

