ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అది తాత్కాలికమే అవుతుందని, అందులో ప్రజలు భాగస్వాములైతేనే అది శాశ్వతమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. అనకాపల్లి జిల్లా నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్నారు.వచ్చే ఏడాది జూన్ నాటికి ఏపీని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తాం. ఇప్పటికే సచివాలయంలో ప్లాస్టిక్ వాడకుండా చర్యలు చేపట్టాం. ప్రస్తుతం 26 ప్రాంతాల్లో స్వచ్ఛ రథాలు ఉన్నాయి. అవసరమైతే 100 రథాలు ఏర్పాటు చేసి పొడిచెత్త సేకరిస్తాం.జనవరి 26 నాటికి ఏ రోడ్డుపైనా చెత్త కనిపించకూడదు. అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

