విజయ్ తమిళనాడులో రాజకీయ పార్టీ స్తాపించిన నేపథ్యంలో ‘జననాయగన్’ మూవీ వాయిదా అంశం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ సినిమాను అడ్డుకోవడం అంటేనే తమిళ సంస్కృతిపై దాడి చేయడమే అని రాహుల్ అన్నారు. ‘‘ ‘జననాయగన్’ సినిమాను అడ్డుకోవడం ద్వారా కేంద్ర సమాచార, ప్రసార శాఖ తమిళ సంస్కృతిపై దాడి చేస్తోంది. మోదీ గారు.. తమిళ ప్రజల్ని అణచివేయాలనే మీ ప్రయత్నాలు సఫలం కావు’’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

