
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సమరశంఖం మోగింది. MPTC ,ZPTC ల ఎన్నికలు నిర్వహణకు అయా జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల. సెప్టెంబరు 10వ తేదీ నాటికి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్లు, పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురించాలని పేర్కొంది. సెప్టెంబరు 6వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్ల జాబితాను సిద్దం చేయాలని ఈసీ కోరింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.