ఐపీఎల్ 2026కు దూరం కావడంపై బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమన్ స్పందించాడు. ‘మిమ్మల్ని జట్టులోంచి తీసేస్తే మీరు ఇంకా ఏమి చేయగలరు?’ అంటూ బంగ్లా మీడియాలో స్పందించాడు. ప్రస్తుతం అతడి మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) ఐపీఎల్ 2026 మినీ వేలంలో ముస్తాఫిజుర్ రూ.9.2 కోట్లకు కొనుగోలు చేసింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుస దాడుల నేపథ్యంలో దీన్ని పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ, బంగ్లా పేసర్‌ను రిలీజ్ చేయాలని కేకేఆర్ ఫ్రాంఛైజీని ఆదేశించింది.

