ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానికి ప్లాన్ బీ పేరిట జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాన్ని రాజధాని చేయాలని అన్నారు. మచిలీపట్నం నుంచి విజయవాడకు 70 కి.మీ దూరం ఉంటుందని, విజయవాడ నుంచి గుంటూరు 40 కి.మీ ఉంటుందని, ఈ ప్రాంతంలో మొత్తం 110 కి. మీ నేషనల్ హైవే ఉందన్నారు. మావిగన్ పేరుతో రాజధాని ప్రాంతాన్ని ప్రకటించాలని అన్నారు.

