ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ప్రమాదానికి గురయ్యింది. మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు.. భారీ వాహనశ్రేణితో వెళుతుండగా ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద ప్రమాదం జరిగింది. జగన్ కాన్వాయ్ లోని కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. దీంతో ఆయా కార్లలోని వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో జగన్ కారుకు ఏమీ కాలేదు.. ఆయన సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యాక్సిడెంట్ కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

