ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌ను ఒక హ్యాబిట్యుయల్ క్రిమినల్ గా అభివర్ణించారు. ప్రజలను నేరుగా ఎదుర్కోలేక, భయంతో దాక్కునే వ్యక్తి అని ఎద్దేవా చేశారు. జగన్ ప్రవర్తనను చూస్తుంటే ఆయనకు ఏదో రోగం ఉన్నట్లు అనిపిస్తోందని, ఆ రకమైన మనస్తత్వానికి ఏ పేరు పెట్టాలో గూగుల్‌లో వెతికినా దొరకడం లేదని అనిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాను చేసే తప్పులను ఇతరులపైకి నెట్టడం ఆయనకు అలవాటని మంత్రి విమర్శించారు.

