రాయలసీమ పేరును వైకాపా రాజకీయం కోసమే వాడుకుందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాయలసీమలోని ప్రాజెక్టును చంపేసిన వైకాపా నాయకులు.. మొసలి కన్నీరు కార్చడం విడ్డూరమన్నారు. మరోవైపు జగన్ నైజం చూసి.. బొత్సకు భయంతో కూడిన బాధ వచ్చిందని మంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. బొత్స అన్న మాటలు గుర్తు చేయడం అచ్చెన్నాయుడి తప్పా అని ప్రశ్నించారు. వైఎస్ మరణం, బాబాయ్ వివేకా హత్యలో అంతిమ లబ్దిదారు జగన్ కాదా? అని వ్యాఖ్యానించారు.

