తొలిసారి ఐసీసీ ఛాంపియన్లుగా చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెటర్లను BCCI ఘనంగా సత్కరించింది. ఆదివారం కన్నులపండువగా జరిగిన వార్షిక అవార్డుల కార్యక్రమంలో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందానికి ప్రత్యేక మెడల్స్ ప్రదానం చేశారు అధికారులు. భారత మహిళల క్రికెట్ జట్టును అందని ద్రాక్షలా ఊరించిన ఐసీసీ ట్రోఫీని 23 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. హర్మన్‌ప్రీత్ కౌర్ సేన కొల్లగొట్టింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీశ్ శుక్లా, జాయింట్ సెక్రటరీ ప్రభుతేజ్ సింగ్ భాటియా మెడల్స్ బహుకరించారు

