
ప్రపంచకప్ తర్వాత అతి పెద్ద టోర్నీగా, మినీ ప్రపంచ కప్ గా పరిగణించే ఈ ట్రోఫీ గెలిచిన విజేతకు ప్రైజ్ మనీ సైతం భారీగా ఉండబోతోంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీని 53% పెంచింది. గెలిచిన జట్టుకు 2.24 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.20 కోట్లు) దక్కుతాయి. అంటే విజేతకు రూ.20 కోట్లు అన్నమాట. రెండో స్థానంలో నిలిచిన జట్టుకు 1.12 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 9.72 కోట్లు) వస్తాయి. సెమీఫైనల్లో ఓడిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లకు రూ. 4.86 కోట్లు దక్కుతాయి.