
షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి చైనాకు చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి అద్భుతమైన స్వాగతం లభించింది. శనివారం సాయంత్రం టియాంజిన్‌లోని బిన్హాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన చేరుకోగానే అక్కడి ప్రవాస భారతీయులు సంబరాలు జరుపుకున్నారు. భారతీయ సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో మోదీని ఆహ్వానించారు. “వందేమాతరం”, “భారత్ మాతా కి జై” నినాదాలతో విమానాశ్రయం పరిసరాలు మార్మోగాయి.