
రాష్ట్రంలోని చేనేత కళాకారుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నేతన్న భరోసా కింద ఏడాదికి ఒక్కో చేనేత కుటుంబానికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రకటించారు. గురువారం గుంటూరు జిల్లా, మంగళగిరిలో నిర్వహించిన 11వ జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు… విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సహకారంతో గతంలో ఏర్పాటైన వీవర్శాలను సందర్శించారు.