ఒక అవార్డు వేడుకలో స్క్రీన్‌పై త్రిష ఫోటో కనిపించడంతో .. “ఈ కుందవైని కొంతకాలం ఇంట్లోనే ఉంచాలి” అంటూ పార్థిబన్ వ్యాఖ్యలకు త్రిష ఘాటుగా స్పందిస్తూ, “చేతిలో మైక్రోఫోన్ ఉన్నంత మాత్రాన చేసే వ్యాఖ్యలు తెలివైనవిగా లేదంటే సరదాగా మారవు. అవతలి వ్యక్తి గురించి పూర్తిగా తెలియకుండా అసభ్యకరంగా మాట్లాడటం వారి సంస్కారాన్ని వెల్లడిస్తుంది” అంటూ పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది. దీనికి స్పందించిన పార్థిబన్.. ఈ విషయంలో జరిగినది చాలా తప్పుగా అనుకున్నారు. నేను ఇప్పుడు పశ్చాతాపం చెందడం తప్ప మరో మార్గం లేదని అన్నాడు.

