లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. దిగువ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉండగా, హైకోర్టులో క్వాష్ పిటిషన్లో మధ్యంతర ఉత్తర్వులు కోరడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్‌కు సంబంధించిన వాదనలను విజయవాడ కోర్టులోనే వినిపించాలని, అక్కడే తగిన ఆదేశాలు పొందాలని మోహిత్ రెడ్డికి సూచించింది.

