సంగారెడ్డి జిల్లా కంగ్జి మండలం రాసోల్ గ్రామంలో సభ్య సమాజం తలదించుకునే అమానుష ఘటన చోటుచేసుకుంది. అంగన్వాడీ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న వసంత్ కుమారి అనే మహిళను గ్రామస్తులు చెట్టుకు కట్టేసి, అసభ్య పదజాలంతో దూషిస్తూ తీవ్రంగా వేధించడం స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలి వసంత్ కుమారి (అంగన్వాడీ టీచర్) భర్త తమను మోసం చేశాడంటూ కొంతమంది గ్రామస్తులు ఆరోపించారు. భర్తపై ఉన్న కోపంతో సంబంధం లేని
మహిళపై విచక్షణారహితంగా దాడికి దిగారు. ఆమెను బహిరంగంగా చెట్టుకు కట్టేసి అవమానకర రీతిలో వేధించారు.

