 
		తమిళనాడులో ఉన్న బిహార్ ప్రజలపై డీఎంకే ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ”ఒక తమిళుడిగా నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వినయంగా కోరుతున్నాను. ఆయన దేశ ప్రజలందరికీ ప్రధాని అనే గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారనే విషయాన్ని తరచుగా మర్చిపోతున్నారేమో అని నాకు బాధగా ఉంది. అలాగే తమిళులు బిహార్ ప్రజల మధ్య విరోధాన్ని సృష్టించే ఇటువంటి చిల్లర రాజకీయ పద్ధతులను మానుకోవాలని నేను ప్రధానమంత్రిని, బీజేపీ సభ్యులను కోరుతున్నాను
 
      
 
								 
								