రాజేంద్రనగర్ మరియు సికింద్రాబాద్ పరిధిలో GHMC అధికారులు చేపట్టిన కూల్చివేతలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ముందస్తు సమాచారం లేకుండా తమ పొట్ట కొడుతున్నారంటూ చిరు వ్యాపారులు అధికారులను అడ్డుకోవడంతో పరిస్థితి రణరంగంగా మారింది. సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పరిస్థితి మరింత విషమించింది. అధికారులు జేసీబీలతో కూల్చివేతలు ప్రారంభించగా, వ్యాపారులు సంఘటితమై అధికారులను, పోలీసులను అడ్డుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోయిన కొందరు వ్యాపారులు జేసీబీలపై దాడికి యత్నించడంతో GHMC సిబ్బంది భయంతో పరుగులు తీశారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.

