కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కి రాసిన లేఖలో, RCB ఫ్రాంచైజీ చిన్నస్వామి స్టేడియంలో 300-350 AI-ఎనేబుల్డ్ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించింది. ఇది ప్రజల కదలికలను పర్యవేక్షించడానికి, పెద్ద క్యూ లైన్లు, స్టేడియం ఎగ్జిట్ ప్రాంతాలను కూడా పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తుంది. స్టేడియంలో AI కెమెరాలను ఏర్పాటు చేసే ఖర్చును తామే భరిస్తామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ (RCB) తెలిపింది. దీని మొత్తం వ్యయం దాదాపు 4.5 కోట్ల రూపాయలు కావచ్చని తెలుస్తోంది.

