
కర్నూలులో ఏర్పాటు చేసిన ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ “జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరూ లాభం పొందారు. మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు ప్రధాని మోదీ అని సీఎం చంద్రబాబు కొనియాడారు. 21వ శతాబ్దం మోదీకి చెందుతుందనడంలో సందేహం లేదన్నారు. 25 ఏళ్లుగా ప్రజా సేవలో సీఎంగా, ప్రధానిగా మోదీ ఉన్నారని తెలిపారు. చాలా మంది ప్రధానులతో పని చేసినా మోదీ వంటి నాయకుడిని చూడలేదన్నారు.
ఎలాంటి విశ్రాంతి లేకుండా నిరంతరం మోదీ పని చేస్తూనే ఉన్నారని తెలిపారు.