చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు. విక్టోరియా గ్రౌండ్‌లో కాల్పులు జరిగిన ప్రాంతాన్ని శనివారం సాయంత్రం సజ్జనార్ పరిశీలించారు. కాలాపత్తర్ రౌడీషీటర్ ఉమర్ సెల్‌ఫోన్ చోరీకి యత్నించాడని సజ్జనార్ తెలిపారు. పట్టుకునే సమయంలో పోలీసులపై దాడికి యత్నించాడని పేర్కొన్నారు. పరిస్థితి చేయి జారకుండా ఉండాలని డీసీపీ చైతన్య కాల్పులు జరిపారని తెలిపారు. ఉమర్ ఎదురుతిరగడంతోనే కాల్పు జరిపామని సీపీ సజ్జనార్ స్పష్టం
చేశారు.

