
దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జి తమిళనాడులోని రామేశ్వరం నుంచి బంగాళాఖాతంలోని రామేశ్వరం దీవిని కలిపేలా నిర్మించారు. నిలువుగా పైకి లేచేలా వర్టికల్ టెక్నాలజీతో ఈ వారథిని నిర్మించారు.2020లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ పనులు ప్రారంభించింది. నాలుగేళ్లలో పూర్తిచేసింది. నిర్మాణంలో కొంచెంకూడా తేడా రాకుండా నిపుణులు జాగ్రత్తలు తీసుకున్నారు. సముద్రంలో రెండు కిలోమీటర్లు పైగా పొడవున్న ఈ వంతెన కింద ఓడల రాకపోకలకు వీలుగా వర్టికల్ లిఫ్ట్ ను ఏర్పాటు చేశారు. దీనికి రెండు వైపులా నిలువు స్తంభాలు ఉంటాయి.