ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగం దశాబ్దాల కల నెరవేరుస్తూ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భోరజ్ మండలం హతిఘాట్ వద్ద చనాక-కొరాటా పంప్ హౌస్‌ను ఘనంగా ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించామని ,ఈ ప్రాజెక్టును ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. పంప్ హౌస్ ప్రారంభించిన అనంతరం, ముఖ్యమంత్రి స్విచ్ ఆన్ చేసి లోయర్ పెనుగంగ ప్రాజెక్టు ప్రధాన కాలువకు సాగునీటిని విడుదల చేశారు.

