ఢిల్లీలో నరమేధం సృష్టించిన కారు పేలుడును ఒమర్ అబ్దుల్లా ఖండించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన జమ్ము కశ్మీర్ ప్రజలు శాంతి, సోదరభావాన్ని పాటించాలని కోరారు. ‘ఢిల్లీలో జరిపిన కారు పేలుడు తీవ్రంగా ఖండించదగినది. అమాయకులను అత్యంత క్రూరంగా చంపడాన్ని ఏ మతం సమర్ధించదు. జమ్ముకశ్మీర్‌లోని ప్రతి ఒక్కరూ ఉగ్రవాది కాదు. ఇక్కడి వారందరికీ ఉగ్రసంస్థలతో సంబంధాలు లేవు. అందుకే అందరినీ ఒకే గాటన కట్టి ఉగ్రవాదులనే ముద్ర వేయడం సరికాదు అని సీఎం అబ్దుల్లా వెల్లడించారు.

