
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటోంది. అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దే క్రమంలో చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. రాజధానిలో పెరుగుతున్న అవసరాలు, కీలక పౌర సదుపాయాలకు స్థలాభావం కారణంగా మరో 44,676 ఎకరాల భూమి సమీకరణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. దీని కోసం సంబంధిత అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు. గతంలో 29 గ్రామాల్లో 34,689 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన సీఆర్డీఏ, ఇప్పుడు ఫేజ్-2 భూ సమీకరణతో అమరావతి విస్తరణకు మరో అడుగు ముందుకేస్తోంది.