“హరిహర వీరమల్లు” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ రాజకీయ భావోద్వేగాలపై కూడా స్పందించారు తన సినిమాకు టికెట్ ధరలు పెంచేందుకు అవకాశం కల్పించిన ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. సినిమా విజయం కోసం మద్దతుగా పోస్ట్ చేసిన నారా లోకేశ్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. “ఎక్కడికి వెళ్లినా అక్కడే పుట్టాను అంటాడు” అంటూ విమర్శించే వారిని బావిలో కప్పలతో పోల్చారు. ఆవిషయాన్ని ఎత్తి చూపుతూ, తన పేరులోనే గాలి ఉందని, కాబట్టి ఎక్కడైనా ఉంటానని చురక వేశారు

