విజయసాయిరెడ్డి రాజీనామాపై తాజాగా వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజయసాయిరెడ్డి లొంగిపోయారని ఆరోపించారు. ఏపీలోని కూటమి ప్రభుత్వానికి మేలు జరుగుతుందని తెలిసి… తన మూడున్నరేళ్ల రాజ్యసభ టర్మ్‌ను ప్రలోభాలకు లోనై అమ్మేశారని సంచలన ఆరోపణలు చేశారు.