
కర్నూలు జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నీటికుంటలో మునిగి ఆరుగురు విద్యార్థులు చనిపోయారు. చనిపోయిన వారందరూ ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. కర్నూలు జిల్లా ఆస్పర్తి మండలంలోని చిగిలిలో
ఏడుగురు విద్యార్థులు కలిసి.. ఊరి చివర కొండ మీద ఉన్న నీటికుంటలో ఈత కొట్టే్ందుకని బుధవారం స్కూలు ముగిశాక బయల్దేరి వెళ్లారు. కొండపై ఉన్న నీటి కుంటలోకి భారీగా నీరు చేరింది. ఈ విషయం తెలియని విద్యార్థులు.. ఈత కోసమని నీటికుంటలోకి దిగి.. లోతు ఎక్కువ కావటంతో కుంటలో మునిగిపోయినట్లు తెలుస్తోంది.