
<span;>దేశ రాజధాని ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షాహదార ప్రాంతంలో మూడు వాహనాల్ని ఓ బస్సు ఢీకొట్టుకుంటూ దూసుకెళ్ళింది. విశ్వాస్‌నగర్‌లో వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా వేగం పుంజుకున్న DTC బస్సు.. నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీ కొట్టింది.స్కూల్ వ్యాన్, ఆటో రిక్షా, ఓ బైక్‌ని ఢీకొట్టుకుంటూ ముందుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులతో పాటు ఓ విద్యార్థికి తీవ్ర గాయాలు అయ్యాయి.