హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్‌కు బస్సు అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా కాలిబూడిదైంది. ప్రయాణికుడు ఆకాష్ (24) తెలిపిన వివరాల ప్రకారం, “బస్సులో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. హఠాత్తుగా లేచి చూడగా పెద్దఎత్తున మంటలు వచ్చాయి. వెంటనే అద్దం పగలగొట్టి బయటకు దూకాను. నాతో పాటు బస్సులో నుంచి మరో ఇద్దరు బయటకు దూకారు. ప్రమాదం జరిగిన వెంటనే కిటికీలు పగలగొట్టి, అత్యవసర ద్వారం ద్వారా బయటపడిన ప్రయాణికులు 21 మంది స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.

