తమిళనాడు ఊటీలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. మనవాడ సమీపంలో ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 32 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారికి అక్కడే స్థానికంగా ఉన్న పలాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ఊదగై మెడికల్ కాలేజీకి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

