
రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల నియామకాలకు బ్రేక్ పడింది. తాము ఆదేశించే వరకు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. విచారణ పూర్తయ్యే వరకు గ్రూప్-1కు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగించేందుకు అనుమతిచ్చింది. గ్రూప్-1 పరీక్ష మూల్యాంకనంలో తప్పులు జరిగాయని, దీనిపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలంటూ ఎం పరమేశ్ సహా 20 మంది దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు గురువారం విచారణ చేపట్టారు.