
గ్రీస్‌లో భారీ భూకంపం సంభవించింది. గ్రీస్‌లోని కార్పాథోస్, కాసోస్ దీవుల సమీపంలో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రోజున భూకంపం చోటుచేసుకుంది.భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదైంది.భూకంప కేంద్రం కాసోస్ రాజధాని ఫ్రై నుంచి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో, ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.ఈ భూకంపం కారణంగా పొరుగున ఉన్న పలు దేశాలలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.జెరూసలేం, సెంట్రల్ ఇజ్రాయెల్, తుర్కియే, ఈజిప్ట్, లిబియాతో సహా విస్తృత ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయని అధికారులు తెలిపారు.