
ఏపీలోని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ నేరుగా కట్టించుకుంటున్న పన్నులన్నీ ఇకపై ఆన్ లైన్ ద్వారా వసూలు చేసేందుకు నిర్ణయించింది. ఇందుకోసం స్వర్ణ పంచాయత్ పేరుతో ఓ ఆన్ లైన్ పోర్టల్ ను డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ రేపు ప్రారంభించనున్నారు. ప్రతీ పంచాయతీ నుంచి వసూలైన మొత్తాలతో పాటు ఖర్చుపెట్టిన లావాదేవీల్ని కూడా ఈ స్వర్ణ పంచాయత్ పోర్టల్ లో అప్ లోడ్ చేస్తారు.