
ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లో గ్యాస్ సబ్సిడీ మొత్తం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ పద్ధతిలో మార్పులు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ ఎప్పుడు బుక్ చేసుకున్నా, సిలిండర్ తీసుకోకపోయినా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల నగదును ఒకేసారి వారి బ్యాంకు ఖాతాలో వేయాలని నిర్ణయించుకున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు.