తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ కొరతపై రాజకీయ వర్గాల్లో చర్చలు రగులుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. “గ్యాస్ లేకపోతే పూర్వకాలంలాగా రాళ్లు కొట్టి మంట పెట్టి వంట వండుకోండి” అనే ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా, ప్రజల్లో విస్తృత చర్చకు కారణమయ్యాయి. పాత కాలంలో ప్రజలు ఎలా జీవించారో గుర్తు చేస్తూ, అవసరమైతే అటువంటి పద్ధతులను కూడా అనుసరించవచ్చని వ్యాఖ్యానించారు

