పశ్చిమాసియాలో జరుగుతోన్న యుద్ధం కారణంగా వంట గ్యాస్ కొరతపై ఆందోళన నెలకున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యంగా విశాఖవాసులకు ఊరట లభించింది. ‘BW బిర్చ్’ అనే భారీ ఎల్పీజీ ట్యాంకర్ విశాఖ నౌకాశ్రయానికి గురువారం చేరుకుంది. ఇందులో భారీ ఎత్తున వంట గ్యాస్ నిల్వలు ఉన్నాయి. గుజరాత్లోని వడినార్ పోర్టులో నందా దేవి నుంచి షిప్-టు-షిప్ బదిలీ ద్వారా ఎల్పీజీని బీడబ్ల్యూ బిర్చ్లో లోడ్ చేశారు.. బిర్చ్తో పాటు ‘ఎంటీ పెట్రాయిట్’ అనే ఆయిల్ ట్యాంకర్ నౌక కూడా ఇప్పటికే విశాఖకు చేరింది.

