టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపై మాజీ చైర్మన్, వైసీపీ అధినేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఆయన చైర్మన్ పదవి స్వీకరించినప్పటి నుంచి గోశాలలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. గోశాలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలన్న ఆలోచన తప్పే కదా అని ప్రశ్నించారు. బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డిని తనపై ఉసిగొల్పి గోవుల మరణం నేను ప్రకటించడం కారణంగా మత విద్వేషాలను, హిందూ ధార్మికతను దెబ్బతీస్తున్నానని, మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నాడు అని నామీద అనేక సెక్షన్లతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు

