
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, పుత్తలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. గోవింద నామాలపై ర్యాప్ సాంగ్ పాడటాన్ని తీవ్రంగా ఖండించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని, వెంటనే వీడియోను తొలగించి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.