ఆత్రేయపురం పూతరేకులు ఎంత ఫేమస్సో బోట్ రేస్‌లు కూడా అంతే ఫేమస్. పొడవాటి పడవల్లో వరుసగా కూర్చొన్న క్రీడాకారులు, డప్పు చప్పుళ్లకు అనుగుణంగా ఒకే లయల తెడ్లు వేస్తూ ముందుకు సాగడం చూపరులను విశేషంగా ఆకర్షిస్తోంది. జట్టును సమన్వయం చేసుకుంటూ విజయం దిశగా సాగే పోటీ. ఒకరికొకరు తోడై, టీమ్‌లుగా విడిపోయి పడవలను వేగంగా నడిపిస్తూ గమ్యానికి చేరుకోవడంలో ఉన్న ఉత్సాహం వర్ణనాతీతం. ఆత్రేయపురం కాలువల్లో సాగే ఈ పోటీల్లో యువతతోపాటు అనుభవం ఉన్న పెద్దలు కూడా పాల్గొంటారు.

