
గొర్రెల కాపరి సివిల్స్‌లో మెరిశాడు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ పరిధిలోని అమగె గ్రామానికి చెందిన బిర్ దేవ్ సిద్ధప్ప డోని ది గొర్రెలు కాచుకునే కుటుంబం. అతను కొండలలో గొర్రెలను మేపుతూ పెరిగాడు. సరైన ఇల్లు కూడా లేదు. వెలుగు ఉన్నప్పుడే చెట్ల కింద కూర్చొని చదువుకునే వాడు. ఇన్ని కష్టాలున్నా అతడు చదువుల్లో ఎక్కడా వెనుకబడలేదు. 10వ తరగతిలో, 12వ తరగతిలో మంచి మార్కులు సాధించాడు. ఇంజినీరింగ్ చేశాడు.యూపీఎస్సీ సివిల్స్ సర్వీసెస్‌లో 551వ ర్యాంకు సాధించాడు.