
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు వడివడిగా అడుగులు పడ్డాయి. జోన్‌కు సంబంధించి పూర్తిస్థాయి అధికారిక అమలు ఆలస్యమవుతోంది. రైల్వేబోర్డు ఉత్తర్వులు (గెజిట్) విడుదలలో జాప్యమే ఇందుకు కారణం. భారతీయ రైల్వేలో కొత్త జోన్ కార్యకలాపాల ఆరంభానికి రైల్వేబోర్డు గెజిట్‌లో హద్దులు, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న వివరాలు స్పష్టంగా పేర్కొంటారు. అది వచ్చాకే ఉద్యోగుల సర్దుబాటు, ఇతర కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.