మొబైల్ ఫోన్‌తో గూగుల్ మ్యాప్స్‌లోకి వెళ్లి ఏ ఊరికి వెళ్లాలనే వివరాలు అందులో నమోదు చేసి, ఎక్కాల్సిన బస్సును ఎంచుకుని డబ్బులు చెల్లిస్తే చాలు అప్పటికప్పుడు రిజర్వేషన్ ఖరారవుతుంది. తెలంగాణ పరిధిలో తిరిగే బస్సులు, అంతరాష్ట్ర సర్వీసుల వివరాలకు గూగుల్‌కు ఇచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం జాబితా సిద్ధం చేసింది. ఈ మహానగర పరిధిలోని సిటీ బస్సుల సమాచారాన్ని ఐటీ శాఖ ద్వారా గూగుల్‌కు కొద్దిరోజులు క్రితం అందించినట్లు ఆర్టీసీ వర్గాల సమాచారం. గూగుల్స్ మ్యాప్‌లో ప్రస్తుతం టెస్టింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.

