
మనం తీసుకున్న ఫొటోల్ని అందంగా, సంవత్సరం, నెల, రోజువారీగా అమర్చి పెట్టే యాప్ గూగుల్ ఫొటోస్. ఆ యాప్ కొత్త డిజైన్, కొత్త రూపంలో వస్తోంది. గూగుల్ ఫొటోస్ యాప్ సమూలంగా మారనుంది. కొత్త సమాచారం ప్రకారం, గూగుల్ కొంతమంది యూజర్లకు సర్వే లింక్‌లను పంపింది. అందులో ప్రస్తుత డిజైన్, కొత్త డిజైన్‌ను పోల్చి అభిప్రాయాలను అడిగింది. వాళ్లందరిలో ఎక్కువమంది దేనికి ఓటు వేశారో.. దాని ప్రకారం ఓకే చేయనుంది. దాంతో కొత్త డిజైన్‌లో చాలా మార్పులు ఉంటాయంటున్నారు.