ప్రధాని నరేంద్రమోదీ అస్సాం రాజధాని గువాహటి లోని లోకప్రియ గోపినాథ్ బర్దోలోయ్ అంతర్జాయ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌ను శనివారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ టెర్మినల్‌ను ఏడాదికి 1.31 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించగల సామర్థ్యంలో నిర్మించారు. అస్సాం తొలి ముఖ్యమంత్రి గోపినాథ్ బర్దోలోయ్ పేరు మీద గువాహటి విమానాశ్రయానికి ఆ పేరు పెట్టారు. విమానాశ్రయం వెలుపల గోపినాథ్ బర్దొలోయ్కు చెందిన 80 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని గతంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించారు.

