బ్రిటన్‌లో అక్కడి ఆకాశం అకస్మాత్తుగా గులాబీ రంగులోకి మారడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. ఫొటోలను తీసి నెట్టింట పంచుకున్నారు. బర్మింగ్‌హమ్‌లో ఈ అద్భుత దృశ్యం కనిపించింది అక్కడి సెయింట్ ఆండ్రూ స్టేడియంలో గులాబీ రంగు ఎల్‌ఈడీ లైట్‌లను ఏర్పాటు చేశారు. గాల్లోని మంచు కారణంగా ఈ వెలుతురు ఆకాశమంతా పరుచుకుని గులాబీ రంగులో మారినట్టు కనిపించింది. మంచు, మేఘాలు గులాబీ కాంతిని భూమి వైపు పంపించే అద్దాల్లాగా పనిచేశాయని శాస్త్రవేత్త ఒకరు తెలిపారు.

