మాజీమంత్రి జీవన్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరనున్నారు. ఇవాళ జగిత్యాలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశం అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. శేషజీవితంలో కేసీఆర్‌తో పనిచేసే అవకాశం వచ్చిందని, అందుకే బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నానని జీవన్‌రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తే రాష్ట్ర భవిష్యత్‌కు పాటుపడవచ్చని జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. 27 నెలలుగా చాలా క్షోభ అనుభవించానని, కాంగ్రెస్‌కు రాజీనామా చేసినప్పుడు భావోద్వేగానికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాలలోని జీవన్‌రెడ్డి నివాసానికి ర్యాలీగా వెళ్లిన కేటీఆర్ కాసేపు సరదాగా మాట్లాడుతూ యోగక్షేమాలు తెలుసుకున్నారు.