
గుడివాడలో టీడీపీ, వైసీపీ మధ్య రోజంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ పేరుతో వైసీపీ విస్తృత స్థాయి సభ ఏర్పాటు చేసింది. ఏడాది పాలన అయిన సందర్భంగా టీడీపీ కూడా తొలి అడుగు కార్యక్రమం ఏర్పాటు చేసుకుంది. మాజీమంత్రి కొడాలి నాని, సీఎం చంద్రబాబు బూట్ పాలిష్ చేస్తున్నట్లు నెహ్రూ చౌక్ సెంటర్లో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. వైసీపీ నేతలు కూడా మోసం గ్యారంటీ ఫ్లెక్సీలు వేశారు. అయితే వాటిని టీడీపీ కార్యకర్తలు చింపేశారు.