గుంటూరు జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన కేసులో రవితేజ అనే ఎస్ఐకు 10 ఏళ్లు జైలు శిక్ష విధించింది. నగరపాలెం ఎస్ఐగా పనిచేస్తున్న సమయంలో రవితేజ మీద నర్సుగా పనిచేసే యువతి ఫిర్యాదు చేసింది. ఎస్ఐ రవితేజ తనను ప్రేమ పేరుతో మోసం చేశారని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించారంటూ 2023లో ఓ యువతి ఎస్ఐ రవితేజ మీద కేసు పెట్టింది. రవితేజ ప్రస్తుతం అమృతలూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా పనిచేస్తున్నారు.

